పూర్వ మెదక్‌ జిల్లాలో 9స్థానాలో టిఆర్‌ఎస్‌ ముందంజ

TRS 1
TRS 1

హైదరాబాద్: పూర్వ మెదక్ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 9 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిక్యంలో ఉంది.  ఇక నారాయణఖేడ్, నర్సాపూర్, దుబ్బాక, మెదక్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు. అలాగే జహీరాబాద్, పటాన్‌చెరులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా గజ్వేల్‌లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ దాదాపు 30వేల పై చిలుకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మిగిలిన సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) ఆధిక్యంలో ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌పై దాదాపు 3వేల పై చిలుకు ఆధిక్యంలో ఉన్నారు.