పీపుల్స్‌ మేనిఫెస్టో రూపొందిస్తాం

laxman
laxman

ఫేస్‌ బుక్‌ లైవ్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ధారించేలా బిజెపి ఎన్నికల ప్రణాళిక ఉంటుందని బిజెపి తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం కోరుతూ బిజెపి వివిధ వర్గాల నుంచి సూచనలు, సలహాలు కోరుతుంది. ఇందులో భాగంగా డాక్టర్‌ లక్ష్మణ్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌ ద్వారా ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ లైవ్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. దాదాపు రెండు వేలపైన కామెంట్లు పెట్టారు. ఒక గంట వ్యవథిలో 65వేల మంది ఈ లైవ్‌ను వీక్షించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలన్న ఆకాంక్షను తెలియజేశారు.ప్రధానంగా టిఆర్‌ఎస్‌ పార్టీ మోసపూరిత విధానాలను,కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ అనేక మంది అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లక్ష్మణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు,సలహాలను స్వీకరించిన లక్ష్మణ్‌ వారడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్న దృక్పథంలో బిజెపి, అధికారంలోకి వస్తే చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలను ప్రజల నుంచే తీసుకుంటామన్నారు. ఓట్లు, సీట్లే ప్రాధాన్యం కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వివిధ అంశాలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు లక్ష్మణ్‌ ఇచ్చిన సమాధానాలు ఆసక్తిగా ఉన్నాయి. ‘ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ ప్రభుత్వంగత నాలుగున్నర సంవత్సరాలుగా అవినీతి లేని ప్రజా సంక్షేమం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో బిజెపి పనిచేస్తుంది. పేదరిక నిర్మూలన కోసం,పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కట్టుబడి పనిచేస్తుందో అదే విధంగా రాష్ట్రంలోనూ పనిచేస్తాం, దేశ భద్రత, సమగ్రత కోసం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలపై ఉన్న నియంత్ర ణను తొలగించాలని, ధార్మిక సంస్థలు దేవాలయాలను నడపాలని, కాను కలను ప్రభుత్వం తీసుకోకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు వర్తింప చేయాలని కోరారు. దీనిపై బిజెపి స్పష్టమైన వైఖరితో ఉందని, దేవాలయ నిధులు దేవాలయానికే ఖర్చు చేయాలని దానికి కట్టుబడి ఉన్నామని,అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తామని, పేద బస్తీలలో దేవాలయాలను నిర్మిస్తామన్నారు.టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విద్యా వ్యవస్థలను దెబ్బతీసిందని, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులను నియమించడంలో టిఆర్‌ఎస్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పేద విద్యార్థు లకు ఆనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. విద్యా ప్రమాణాలను పెంచుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, బిజెపి ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని, విద్యా ప్రమాణాలు పెంచడానికి మోగా డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. పక్కా ప్రణాళికతో ఇల్లు లేని ప్రతి నిరుపేదకూ సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తామన్నారు.చాకలి ఐలమ్మతో పాటు దొడ్డి కొమరయ్య, సోయబుల్లా ఖాన్‌, షేక్‌ బందగి, కొమరం భీం లాంటి దేశ భక్తులను, పోరాట యోధులను, అమరులను ఖచ్చి తంగా గౌరవిస్తామన్నారు. బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. మొత్తంగా బిజెపి పీపుల్స్‌ మేనిఫెస్టోను రూపొందిస్తుందన్నారు. ప్రజాభిష్టానికి అనుగుణంగా ఉంటుందని,తెలంగాణ భవిష్యత్తు కోసం సమాజంలోని విభిన్న వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించే ప్రజల మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు.