పీడీ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం

ts minister nayini
ts minister nayini

హైదరాబాద్‌: పీడీ చట్టం సవరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం సాగింది. నేరస్థులను సమర్ధిస్తారా అంటూ హోం మంత్రి అనడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. హోం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టాయి. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపాలని కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్‌ చేశాయి.