పాల‌క టిఆర్ఎస్ పాల‌న అవినీతిమ‌యంః ల‌క్ష్మ‌ణ్‌

Laxman
Laxman

కామారెడ్డిః టీఆర్ఎస్ పాలనంతా అవినీతి మయంమైంద‌ని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బిజెపి చేపట్టిన జన చైతన్య యాత్ర మద్నూర్‌లో సాగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగిస్తూ… ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనా విధానాలను తూర్పారబట్టారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకే జనచైతన్య యాత్ర చేపట్టామని అన్నారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు.