పాలమూరును ఆధునీకరిస్తాం

harish rao
Minister HarishRao

పాలమూరును ఆధునీకరిస్తాం

మహబూబ్‌నగర్‌: స్థానిక వ్యవసాయమార్కెట్‌ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఓట్ల భయంతోనే ప్రతిపక్షాలు భూసేకరణను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకుసాగునీరుఅ ందించటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పాలమూరు జిల్లాకు వ్యవసాయ కలాశాలను మంజూరు చేయటంలో సిఎం కెసిఆర్‌ చొరవచూపారంటే పాలమూరు జిల్లాపై సిఎంకు ఎంత శ్రద్ధ, ప్రేమ ఉందో తెలుస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తికి రైతులందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.