పాలక టిఆర్‌ఎస్‌లో అవినీతి జాడ్యం: దత్తాత్రేయ

B.Dattatreya
B.Dattatreya

యాదాద్రి భువనగిరి: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర విమర్శలు సంధించారు. తెలంగాణలో అవినీతి వీరవిహారం చేస్తుందని ఆరోపించారు. నేడు మీడియాతో మాట్లాడుతూ టీచర్ల బదిలీ, రైతుబంధు పథకంతో విచ్చలివిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఫసల్‌ భీమా యోజన పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణిచివేస్తోందని దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మహిళలు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే తథ్యం అని ఆయన అన్నారు.