పార్లమెంటు ఎన్నికలలో పొత్తులు ఉండాల్సిందే

jagga reddy
jagga reddy

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్ది
హైదరాబాద్‌: వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు కుదుర్చుకుంటే మేలు కలుగుతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. పొత్తులపై పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మెదక్‌ సీటు అవకాశం ఇస్తే తన భార్య నిర్మలకు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తన భార్యకు అవకాశం ఇస్తే గెలిపించుకుని వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తన భార్యకు అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరైనా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు వల్ల ఎలాంటి నష్టం లేదనీ, పొత్తు వల్ల జగన్‌ పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారనీ, అందుకే హైదరాబాద్‌లో నష్టం జరిగిందని పేర్కొన్నారు. సీఎల్పీ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసిసి ఇంచార్జి కార్యదర్శి కుంతియా, టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను కోరినట్లు చెప్పారు.