పార్టీ మార్పుపై ఆచితూచి ప్రతిస్పందన

DS
DS

పార్టీ మార్పుపై ఆచితూచి ప్రతిస్పందన

దాగుడు మూతలకు తెరపడేనా?
సస్పెన్షన్‌పై టిఆర్‌ఎస్‌ వెనకడుగు

నిజామాబాద్‌: టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్‌ పార్టీని వది లి కాంగ్రెస్‌లో చేరతారనే విషయంలో వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలం గా ఆయన కాంగ్రెస్‌లో చేరి నిజామాబాద్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారనే ఊహాగా నాలకు తెర దించుతూ, ఆయన పార్టీ మారే విషయంలో ఆచి, తూచి వ్యవహ రిస్తున్నట్లుగా కనపడుతోంది. శనివారం ఉదయం ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశమైన డిఎస్‌ పార్టీలో చేరిక విషయమై స్పందించేందుకు నిరాక రించారు. పార్టీలో చేరారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు, పార్టీలో చేరు తున్నట్లు చెప్పానా? అంటూ ఎదరు ప్రశ్నించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మర్యాద పూర్వకంగానే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసినట్టు చెప్పారు. శనివారం ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోగా, వారితో పాటే రాహుల్‌ గాంధీని కలిసిన డి. శ్రీనివాస్‌ మాత్రం కండువా కప్పుకోలేదు సరికదా పార్టీలో చేరినట్టు కూడా ప్రకటించలేదు.

గతంలో రెండుసార్లు పిసిసి అధ్యక్షుడిగా పని చేసి రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి సూత్రదారిఐన డి. శ్రీనివాస్‌ రాజ్యసభ సభ్యత్వ విషయమై ఆచి, తూచి వ్యవహరిస్తున్నట్లు తెలు స్తుంది. ఆయన సన్నిహితుల ద్వారా అందిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు గెలుపు ఓటమిలపై రాహుల్‌తో ఆయన చర్చించినట్టు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయ సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన తనకున్న అనుభవాలను రాహుల్‌కు వివరించినట్టు తెలిసింది.

కాగా కాంగ్రెస్‌లో చేరితే పిరాయింపు చట్టం ప్రకారం రాజ్యసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందన్న విషయమై ఆయన మౌనం పాటిస్తు న్నారని, కాంగ్రెస్‌ విజయానికి తన సంపూర్ణ సహ కారం అందిస్తానని రాహుల్‌కు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ కలిసి చర్చలు జరపడం పట్ల టిఆర్‌ఎస్‌ పార్టీ నిశితంగా గమనిస్తున్నది. గత కొంతకాలంగా డిఎస్‌ విష యంలో దాగుడు మూతలు ఆడుతున్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఇక ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మూడు మాసాల క్రితం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న డి. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను కోరగా ఇంతవరకు ఆయనపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు.

కాగా ఇటీవల డిఎస్‌ తన అనుచరవర్గంతో సమావేశమైన అనంతరం తనపై చర్య తీసుకోండి లేదా తప్పుడు ఆరోపణలు చేసినం దుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసి నెల రోజులు కావస్తున్న అలాంటి చర్యలేవీ తీసుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు రాహుల్‌తో సమావేశం అయినట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారా లేక మౌనంగా ఉంటారో వేచి చూడాలి. డి. శ్రీనివాస్‌ వ్యూహాం ఇప్పుడు టిఆర్‌ఎస్‌ పార్టీని ఇరకాటంలో పెట్టిందని చెప్పవ చ్చు. సస్పెండ్‌ చేయకపోతే డిఎస్‌ లాంటి మరికొం దరు తెరపైకి రావచ్చునన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనను పార్టీ సస్పెండ్‌చేస్తే రాజ్యసభ సభ్యత్వానికి ఢోకా లేకుండా ఆయన న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది.