పార్టీ ఫిరాయింపులు అప్రాజాస్వామికం

bandaru dattatreya
bandaru dattatreya

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత, సియం కేసిఆర్‌ పార్టీ ఫిరాయింపులపై చూపిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే విరుద్ధమని కేంద్ర మాజీ మంత్రి, బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజా తీర్పును గౌరవించుకుండా పార్టీ ఫిరాయంపులతో కేసిఆర్‌ అవమాన పరుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజ్యాంగబద్ధమైన పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన శాసన మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం బాధాకరమని అన్నారు. మోది ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. బిబినగర్‌ ఎయిమ్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి తెలంగాణకు ప్రయోజనం చేకూర్చిందన్నారు. టిఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్నినిందిచడం మానుకోవాలని దత్తాత్రేయ హితవు పలికారు.