పాయింట్ల విధానంపై పెదవి విరుస్తున్న వాహనదారులు

traffic police
traffic police

హైదరాబాద్‌: ఆగస్టు ఒకటి నుంచి నగరంలో అమల్లోకి వచ్చిన ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాయింట్ల విధానానికి
వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు దీనిని వ్యతిరేకించగా మరికొందరు ఈ పద్దతి
మంచిదే కాని చిన్న చిన్న తప్పులకే లైసెన్స్‌ రద్దు చేస్తామంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. రోడ్లు బాగు చేసి,
జీబ్రాలైన్‌, స్టాప్‌లైన్‌ ఆన్నింటిని సక్రమంగా ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ విధానం అమలు చేస్తే మంచిదని
చాలా మంది అభిప్రాయపడుతున్నారు. హెల్మెట్‌ పెట్టుకుంటే మంచిదే కాని దానిని ధరించడం వల్ల పక్క నుంచి
వచ్చే వాహనాలు కనిపించవని, వెనుక వాహనదారుడు హారన్‌ కొట్టినా ఒక్కోసారి వినపడదని, మరికొందరి వాదన.
ఇక ఆటోల విషయానికి వస్తే నలుగురు సభ్యుల కుంటుంబం ఆటో ఎక్కాలన్నప్పుడు ముగ్గురు వెనుక కూర్చొంటారని,
మరోకరినిడ్రైవర్‌ పక్కనే కూర్చోబెట్టక తప్పదని.. దానికి కూడా పాయింట్లు లెక్కగట్టి లైసెన్స్‌రద్దు చేయడం అన్యాయం
అని ఆటోవాలాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సమస్యలతో కూడిన ఈ పాయింట్ల విధానంపై ప్రజల్లో పూర్తి
అవగహన కల్పించాకే ప్రవేశపెట్టాలని వాహనదారులు కోరుకుంటున్నారు.