పరేడ్‌ గ్రౌండ్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Police
Traffic Police

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలో గల పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ట్రాపిక్‌ ఆంక్షలు అమలు చేస్తామని ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9నుంచి మధ్యాహ్నాం 12.30గంటల వరకు ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ సిపి తెలిపారు.