పదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Rape on Minor

పదేళ్ల చిన్నారిపై అత్యాచారం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని కూచనపల్లిలో దారుణం జరిగింది. ఇంటిముందు ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసారు కామంధులు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం తన ఇంటిముందు ఆడుకుం టున్న బాలికను మాయమాటలు చెప్పి ప్రవీణ్‌, గణేష్‌ మోటారుసైకిల్‌పై ఎక్కించుకొని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆతర్వాత బండరాయితో కొట్టి చంపే సారు. విషయం తెలుసుకున్న చిన్నారి బంధువ్ఞలు నిందితులను పోలీసులకు పట్టించారు. కఠినంగా శక్షించాలని పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా చేసారు.