న‌ల్గోండ‌లో ప్ర‌శాంతంగా ముగిసిన టిఆర్టీ ప‌రీక్ష‌లు

TRT
TRT

నల్గొండ: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన టీఆర్టీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 8224 మంది అభ్యర్థులకు గాను 7490 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 734 మంది హాజరు కాలేదు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జేసీ నారాయణరెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అయితే.. నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వచ్చిన ఎనిమిది మంది అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయకుండానే ఆ అభ్యర్థులు వెనుదిరిగారు.