న‌దుల సంర‌క్ష‌ణ‌కు ఈషా సంస్థ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధంః మంత్రి హ‌రీశ్ రావు

harish rao
harish rao

హైదరాబాద్‌: ఈషా ఫౌండేషన్‌ చేపట్టిన ‘ర్యాలీ ఫర్‌ రివర్స్‌’ కార్యక్రమం అభినందనీయమని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
నదుల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తోన్న ఆ సంస్థ సంకల్పం గొప్పదన్నారు. నదులను సంరక్షించుకొనేందుకు తాము ఈషా సంస్థతో
కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. గురువారం హైదరాబాద్‌లో ‘ర్యాలీఫర్‌ రివర్స్‌’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలంగాణలో హరితహారం ద్వారా 88వేల కోట్ల మొక్కలు నాటామని, చెరువుల పునరుద్ధరణకు
తెరాస ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. కాకతీయుల నుంచి వారసత్వంగా వచ్చిన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మిషన్‌ కాకతీయలో భాగంగా రాష్ట్రంలో 46వేల చెరువులను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. గోదావరిని 365 రోజులు జీవనదిగా మార్చాలనేది
తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నదులను కాపాడుకుంటూ, అడవుల శాతం పెంచాలనేదే తమ లక్ష్యమని, అడవులు బాగా ఉన్నచోటే వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయన్నారు.