నేడు హుజూర్‌నగర్‌లో కెసిఆర్‌ ప్రచారం

బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి

CM KCR
CM KCR

హైదరాబాద్‌: ఈ నెల 21న ఉప ఎన్నిక జరగనున్న హుజూర్‌నగర్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం నిర్వహించనున్నారు. టిఆర్‌ఎస్‌ నాయకులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు హుజూర్‌నగర్ గుట్ట సమీపంలో జరిగే బహిరంగ సభలో కెసిఆర్‌ ప్రసంగిస్తారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కెసిఆర్‌.. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి తరపున స్వయంగా ప్రచారానికి దిగడం గమనార్హం.

మధ్యాహ్నం 12:30 గంటలకు కెసిఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్ చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. అనంతరం రాత్రి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, కెసిఆర్‌ ఆరున్నర నెలల తర్వాత మళ్లీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చివరిసారి ఏప్రిల్ 8న వికారాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/