నేడు న్యూఢిల్లీకి సీఈసి రజత్‌కుమార్‌

 

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్‌ :రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. రానున్న 6 నెలల్లో ఎన్నికలు పెట్టాలి. ఎన్నికల కమిషన్‌ పనులు మొదలు పెట్టారు. ఏవిఎం,వివి పాట్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 11వ తేదీన జాతీయ ఎన్నికల కమిషన్‌ అధికారులు హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. 11న సాయంత్రం 6.30 గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీలతో కేంద్ర బృందం సమావేశం కానుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘంతో భేటీ కానుంది. 12న ఉదయం నంచి సాయంత్రం వరకు తెలంగాణలోని కలెక్టర్లు,ఎస్పీలతో భేటీ కానుంది. సాయంత్రం సిఎస్‌,డిజిపితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. సమావేశాలన్నీ ముగిసిన తర్వాత 5-30 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తుంది.