నేటి సాయంత్రం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic Police
Traffic Police

హైదరాబాద్‌: నేడు సాయంత్రం నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ నేడు సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రెండు గంటల పాటు రాజ్‌భవన్‌ వైపు వెళ్లే మార్గంలో మూసివేయనున్నారు. దీనికి నగర ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.