నిరాధార వ్యాఖ్య‌లు స‌రికావుః మంత్రి హ‌రీష్‌

Harish rao
Harish rao

హైద‌రాబాద్ః టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరాధార మాట‌లు మానుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప‌లు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి.. వాళ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు అమాయకులు కారు.. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని, మహబూబ్‌నగర్‌లో 6.50 లక్షల ఎకరాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీరు ఇచ్చిందన్నారు.