నారాయ‌ణ‌ఖేడ్‌లో మంత్రి ప‌ర్య‌ట‌న‌

T HARISH RAO
T HARISH RAO

నారాయ‌ణ‌ఖేడ్ః నారాయణఖేడ్ నియోజకవర్గంలో శనివారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంజూరైన సబ్సిడీ ట్రాక్టర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం రైతుబంధు పథకంపై నిర్వహించే అవగాహన సదుస్సులో పాల్గొన్నారు. నారాయణఖేడ్ మండలంలోని నాలుగు గ్రామాల్లో నిర్మించనున్న గోదాంలు, డ్రై ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించిన పనులను పోతన్‌పల్లిలో మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.14.45 కోట్లతో చేపట్టనున్న నియోజకవర్గంలోని పలు రోడ్ల బీటీ రెన్యువల్ పనులను మంత్రి ప్రారంభించారు.