నాకు శ‌త్రువులు లేరుః మండ‌లి ఛైర్మ‌న్‌

Swamy goud
Swamy goud

హైద‌రాబాద్ః తెలంగాణ అసెంబ్లీలో జరిగిన దాడిలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు కంటికి గాయమైన విషయం విదిత‌మే. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తనకు శత్రువులు ఎవరూ లేరని, అసెంబ్లీలో ఈరోజు జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై తుది నిర్ణయం స్పీకర్ దేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాడు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పడు తనపై హత్యాయత్నం, దాడి ఘటనలు జరిగాయని అన్నారు. చట్టసభల్లో అందరూ హుందాగా వ్యవహరించాలని, దాడులు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేమని ఈ సందర్భంగా స్వామిగౌడ్ అభిప్రాయపడ్డారు. కాగా, అసెంబ్లీలో స్వామిగౌడ్ పై మైక్ దాడికి సంబంధించిన దృశ్యాలను విడుదల అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు లేదా సభ్యులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.