నవయుగలో ఐటి రైడ్స్‌

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరోసారి ఐటి సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ నవయుగ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ సంస్థలో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నవయుగకు చెందిన 47 సంస్థల వ్యవహారాల సమాచారం సేకరిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఐటి రిటర్న్స్‌, ప్రాజెక్టుల నిర్వహణపై ఆదాయ పన్నుశాఖ విచారణ జరుపుతుంది. రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నిబంధనలను ఆ కంపెనీ ఉల్లంఘించిదనే ఆరోపణలున్నాయి. నవయుగ బెంగళూరు టోల్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌, నవయుగ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, నవయుగ క్వాజీగండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ,కృష్ణా డ్రైడ్జింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, శుభం కార్పొరేషన్‌ సంస్థల లావాదేవీలపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు.