ధాన్యం త‌డిచినా కొనుగోలు చేస్తాం

EATELA RAJENDER
EATELA RAJENDER

హైద‌రాబాద్ః రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తడిచిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన దృష్ట్యా… పౌరసరఫరాల శాఖ అధికారులందరూ తక్షణమే వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఐకేపీ కేంద్రాలను సందర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనకపోయినా సరైన మద్ధతు ధర అందకపోయినా అధికారుల దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.