ద‌లైలామా సెంట‌ర్ ఆఫ్ ఎథిక్స్‌కు భూమి కేటాయింపు

dalailama
dalailama

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో దలైలామా సెంటర్ ఆఫ్ ఎథిక్స్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. దలైలామా సెంటర్ ఎకరా 28 గుంటల భూమిలో దక్షిణాసియా హబ్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సంబంధిత భూమిని పంచాయతీరాజ్‌శాఖ నుంచి జీహెచ్‌ఎంసీకి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జీహెచ్‌ఎంసీ భూమి లీజు ఒప్పంద విధివిధానాలను ఖరారు చేయనుంది.