తె.జ‌.స స‌భ‌కు వ‌స్తున్న అశేష జ‌న‌వాహిని

TJS
TJS

హైద‌రాబాద్ః తెలంగాణ రాజ‌కీయ ఐకాస మాజీ ఛైర్మ‌న్‌,  తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య కోదండరామ్ సార‌థ్యంలో ఏర్పాటైన తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హైదరాబాద్‌లోని సరూర్‌ నగర్‌ మైదానానికి కోదండరామ్‌తో పాటు టీజేఏసీ నాయకులు చేరుకోనున్నారు. ఈ సభ ద్వారా తమ పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. అలాగే, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడిగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణలో పాలనా పరంగా పలు మార్పులు రావాల్సి ఉందని చెబుతోన్న కోదండరామ్‌.. తమ పార్టీ తెలంగాణలో ఎలా ప్రత్యామ్నాయ వేదికగా మారబోతోందనే విషయంపై స్పష్టతనివ్వనున్నారు.