త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు

RAJATH KUMAR
RAJATH KUMAR

హైదరాబాద్: త్వరలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలో సీఎస్ ఎస్‌కే జోషితో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఈవో రజత్ కుమార్… ఈ నెల 22న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు.ఓటరు జాబితా నమోదు ప్రక్రియ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాపై ఈనెల 25 వరకు గడువు ఇచ్చింది. మేము ఫిబ్రవరి 4 వరకు గడువు కోరినం. పోలింగ్ కేంద్రాల దగ్గర బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల దగ్గరకు వెళ్లి ఓటు ఉందో లేదో తెలుసుకోవాలి. ఎన్నికల్లో ఓటరు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినం. గ్రాడుయేట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం.