త్వరలో జిల్లాలో పాస్‌పోర్ట్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి: హరీష్‌రావు

T HARISH RAO
T HARISH RAO

 

సిద్దిపేట: త్వరలో సిద్దిపేట పాస్‌పోర్ట్‌ కేంద్రం అందుబాటులోకి రానున్నదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ
మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా పోస్టల్‌ శాఖకు లేఖ రూపంలో సిద్దిపేటలో పోస్టల్‌
కార్యాలయంలో పాస్‌పోర్టు కేంద్ర ఏర్పాటు చేయాలని రాశానని తెలిపారు. అందుకు స్పందించిన పోస్టల్‌
శాఖ వారు సిద్దిపేటకు పాస్‌పోర్టు కేంద్రాన్ని మంజూరే చేస్తున్నట్లు తెలిపారన్నారు. తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌
పోస్టల్‌ మేనేజర్‌ సిద్దిపేట పోస్టల్‌ కార్యాలయంలో పాస్‌పోర్టు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని లేఖలో
వెల్లడించారని మంత్రి అన్నారు. త్వరలో పాస్‌పోర్ట్‌ కేంద్రం సేవలు అందుబాటులో వస్తాయన్నారు.