తెల్ల‌వారు ఝామున హైద‌రాబాద్‌లో స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు

earth quake graph
earth quake graph

హైద‌రాబాద్ః హైదరాబాదులో శ‌నివారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా ప్రకంపించింది. యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రహ్మత్ నగర్ డివిజన్ లోని ఇందిరానగర్, ప్రతిభానగర్, హెచ్ఎఫ్ నగర్ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని… తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల సమయంలో ఇది చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. భూమి కంపించిన ప్రాంతాల్లో ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఈ భూప్రకంపనల వల్ల ఎవరికీ, ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.