తెలంగాణ పోలీసు శాఖ‌లో ఆరు శౌర్య ప‌త‌కాలు

telangana police
telangana police

హైదరాబాద్ః పోలీస్‌శాఖలో విశిష్ట సేవలు అందించిన పలువురు పోలీస్ అధికారులు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రకటించింది. ఈ మేరకు ఆ జాబితాను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. పోలీస్ శౌర్య పతకం (పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ), రాష్ట్రపతి పోలీస్ విశిష్ఠ సేవాపతకం, ఉత్తమ పోలీస్ సేవా పతకం సహా మొత్తం మూడు క్యాటగిరీల్లో కలిపి 795మందికి అవార్డులు దక్కాయి. వీరిలో 75మందికి రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవాపతకం, 107మందికి పోలీస్‌సేవా శౌర్య పతకం, 613 మందికి ఉత్తమ పోలీస్ సేవా పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి పోలీస్ శౌర్య సేవా పతకానికి (గ్యాలంట్రీ) ఆరుగురు, రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పతకానికి ఇద్దరు, ఉత్తమ పోలీస్ సేవా పతకానికి 13 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు.