తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

TS LOGO
TS LOGO

హైదరాబాద్‌ : నిరుద్యోగులకు ఇదో శుభవార్త. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. 7 అసిస్టెంట్‌ కమిషనర్‌, ఒక అసిస్టెంట్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌, 3 స్టెనోగ్రాఫర్‌, ఒక జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌, 16 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/