తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ముట్ట‌డికి ఏబివిపి య‌త్నం

B I I
Board of Intermediate Education, Telangana

హైదరాబాద్‌: వేసవి సెల‌వుల్లో తరగతులు నిర్వహిస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ జూనియ‌ర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ఏబీవీపీ ముట్టడించింది. ఎంతసేపటికి అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో గేటు లోపలికి చొచ్చుకుపోవడానికి ఏబీవీపీ నాయకులు యత్నించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి బేగంబజార్ ఠాణాకు తరలించారు. వేసవి సెల‌వుల్లో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఏబీవీపీ నాయకులు అరోపించారు. కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు.