తెలంగాణ‌లో కుటుంబ పాల‌నః జ‌వ‌దేక‌ర్‌

Prakash javadekar
Prakash javadekar

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ విమర్శలు గుప్పించారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ జన చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి రావడం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబపాలనను పారద్రోలారని, తెలంగాణలో మాత్రం ఇంకా కుటుంబ పాలనే సాగుతోందని విమర్శించారు. పంచపాండవులైన బీజేపీ ఎమ్మెల్యేలు, వంద మంది ఉన్న టీఆర్ఎస్ కౌరవులతో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో ఆలోచించాలని అన్నారు. తెలంగాణలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరాకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని,14 పంటలకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల యాభై ఏళ్ల కలను మోదీ సాకారం చేశారని, మోదీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నారు. జనచైతన్య యాత్ర గురించి మాట్లాడుతూ, ఈ యాత్ర ఇంతటితో ఆగిపోదని, ఏడాది పాటు కొనసాగుతుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ గురించి గురించి ఆయన ప్రస్తావించారు. టీడీపీతో స్నేహంగానే ఉన్నప్పటికీ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు.