తెలంగాణ‌కు మ‌రో అవార్డు

Telangana
Telangana

తెలంగాణ వైద్య శాఖకు మరో జాతీయ అవార్డుతెలంగాణ వైద్య ఆరోగ్యశాఖకు మరో జాతీయ అవార్డు దక్కింది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు, రివార్డులు పొందడంలో ముందున్న వైద్య శాఖ ఇంకో అవార్డు పొందింది. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సిఎస్‌ఐ) ప్రతి యేటా అందించే నిర్వహించే ఈ గవర్నెస్స్‌ అవార్డు-2017కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బెస్ట్‌ ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ అవార్డు ఆఫ్‌ రికగ్నేషన్‌(హెల్త్‌ అండ్‌వెల్‌ బీయింగ్‌) విభాగంలో ఎంపికైంది. రాష్ట్రాల విభాగంలో తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. కొల్‌కత్తాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డుని తెలంగాణ ప్రభుత్వం తరుపున వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అందుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్ర, రాజస్థాన్‌ డిప్యూటీ స్పీకర్‌ రాజేంద్రసింగ్‌ల చేతుల మీదుగా కరుణతో పాటు కుటుంబ సంక్షేమ సిపిఓ డా.గడప శ్రీనివాసరావు, గోపికాంత్‌రెడ్డి, కెసిఆర్‌ కిట్ల ఓఎస్‌డి సత్యనారాయణరెడ్డి, ఐటి సత్య తదితరులు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ, ఐటి శాఖలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి అభినందించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరు మెరుగుకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడం సమాచారాన్ని కంప్యూటీకరించడం, వైద్య సేవల్లో పారదర్శకతను పెంచడంలో ఐటి శాఖ చేసిన కృషిని మంత్రి కొనియాడారు.  తెలంగాణ ఆవిర్భావం తరువాత సిఎం కెసిఆర్‌ మార్గనిర్ధేశనంలో వైద్య ఆరోగ్యశాఖ అనేక కొత్త పథకాలను రూపొందించి అమలు పరచడం జరుగుతుందన్నారు. మౌలిక వసతులు వైద్య సదుపాయాల విస్తరణ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఐటి శాఖ సహకారం అద్బుతంగా ఉందని సిఎస్‌ఐ అభినందించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకుఈ అవార్డుకి ఎంపిక చేసినట్లు సిఎస్‌ఐ వైద్యఆరోగ్యశాఖను అభినందించింది. అవార్డు రావడంపై ఎంతో సంతోషంగా ఉందని సిఎం శ్రమతో పాటు వైద్యఆరోగ్యశాఖమంత్రి డా.సి.లక్ష్మారెడ్డిల ప్రోత్సాహం ఉందని కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి అరుణ తెలిపారు.