తెలంగాణకు బిజెపినే ప్రత్యామ్నాయం

Ram madhav
Ram madhav

నిజామాబాద్‌: మోది ప్రభంజనంలో కొట్టుకుపోతాననే భయంతో కేసిఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని బిజెపి నేత రాంమాధవ్‌ అన్నారు. తెలంగాణకు బిజెపినే ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్మూర్‌లో బిజెపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాంమాధవ్‌ మాట్లాడుతూ..కేసిఆర్‌ కుటుంబం బంగారుమయం అయిందని, మోది దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, కేసిఆర్‌ తెలంగాణను వెనక్కి తీసుకెళ్తున్నారని విమర్శించారు. కేసిఆర్‌ లాగే చంద్రబాబు కూడా అవినీతిపరుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.