తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

POCHARAM copy
POCHARAM

ఇకపై తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో రైతు సమన్వయ సమితి సమావేశం జరిగింది. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రతి గ్రామంలో 15మంది రైతులతో సమితి ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామంలో ఉండి వ్యవసాయం చేస్తున్న వారికే సాగు పెట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 131 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయన్నారు.