డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులు..

నల్గోండ: పట్టణంలో డ్రండ్ అండ్ డ్రైవ్లో భాగంగా పట్టుబడ్డ ఏడుగురికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టగా పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 21 మంది పట్టుబడ్డారు. వీరందరిని నేడు కోర్టులో హాజరుపరిచారు. వీరిలో ఆరుగురికి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్పెషల్ కోర్టు వారం రోజుల క్రితం జైలు శిక్ష విధించింది. అనంతరం వారిని పోలీసులు జైలుకు తరలించారు.