డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం

DS1
DS

నిజమాబాద్‌: నన్ను సస్పెండ్‌ చేయండి. లేకుంటే తీర్మానం వెనక్కి పంపండి అని మంగళవారం చెప్పిన టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌ మళ్లీ ఈరోజు సొంత గూటికే చేరతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాలను డీఎస్‌ కలవనున్నారని, ఆయన పార్టీలో చేరడానికి అధిష్టానం కూడా ఒప్పుకుందని తెలుస్తుంది. ఈనెల 11న సోనియా, రాహుల్‌ సమక్షంలో డిఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని సమాచారం.