టీఆర్‌ఎస్‌ లో ఆరేపల్లి మోహన్‌ చేరిక

హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నేడు పార్టీని వీడారు .టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో ఆరేపల్లి చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ని కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, ఆరేపల్లి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసే ఆ పార్టీలో చేరానని అన్నారు. ఖబంగారు తెలంగాణగ సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోందని విమర్శించారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/