టిటిడిపి గూటిని వీడనున్న మరో ఇద్దరు నేతలు

 

TTDP News
TTDP

 

టిటిడిపి నుంచి గుడ్‌ బై చెప్పే యోచనలో మరో ఇద్దరు నాయకులు ఆసక్తి కనబరుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు
సమాచారం. క్రియాశీలక రాజకీయులకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న మండవ వెంకటేశ్వరరావు తన
భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే ఉద్దేశ్యంతో తన అనుచరులు, ఇతర నేతలతో సమావేశమైనట్లు సమాచారం.
డిచ్‌పల్లి మండలం ధర్మవరంలో తన నివాసంలో టిడిపి నేతల భేటీ జరిగింది. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే
అన్నపూర్ణమ్మ, మరో నాయకుడు అరికెల నర్సారెడ్డి హాజరయ్యారు. అరికెల నర్సారెడ్డి పార్టీ మారతారనే వార్తలు
కొంత కాలంగా వినిపిస్తున్నాయి. టిడిపి నుంచి వచ్చేసిన రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంతో మండవ వెంకటేశ్వరరావు నిర్వహించిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.