టిఎస్‌ ఐపాస్‌ విధానం బాగుంది

tsiic
tsiic

తెలంగాణ పరిశ్రమల శాఖపై త్రిపుర బృందం ప్రశంస
హైదరాబాద్‌: తెలంగాణలో పరిశ్రమల అనుమతికి సంబంధించి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఎస్‌ ఐపాస్‌ విధానం బాగుందని త్రిపుర రాష్ట్రానికి చెందిన సిఎం అదనపు సెక్రటరీ డా.మిలింద్‌ రామ్‌టేకే బృందం సోమవారం బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఇండిస్ట్రియల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అధికారులను కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పరిశ్రమల పాలసీ, టిఎస్‌ఐపాస్‌ విధానాలను ప్రాజెక్టు చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ వి.మధసూదన్‌ వివరించారు. ప్రభుత్వం పరిశ్రమల అనుమతులు ఇచ్చే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశాలపై వారికి వివరించారు. ఈ సందర్భంగా సిఎం అదనపు సెక్రటరీ డా.మిలింద్‌ రామ్‌టేకే మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులు ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ విధానాలను తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నించనున్నట్లు, ఉన్నతాధికారుల బృందం త్వరలోనే తెలంగాణకు వస్తుందని, స్టడీటూర్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టిఎస్‌ఐఐసి చీఫ్‌ ఇంజనీర్‌ కె.శ్యాం సుందర్‌, డైరక్టర్‌ ఫార్మా, లైఫ్‌ సైన్స్‌ శక్తి నాగప్పన్‌, లాజిస్టిక్‌ డైరక్టర్‌ రూపేష్‌ సింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరక్టర్‌ అఖిల్‌కుమార్‌ గోహార్‌, మెగా టెక్స్‌టైల్స్‌ డైరక్టర్‌ మిహిర్‌ పరేక్‌తో పాటు సిజిఎం డి.గీతాంజలి, జిఎం సునితాబా§్‌ు, డిజిఎం శారదలు పాల్గొన్నారు. కాగా త్రిపుర నుంచి అగర్తాలా మున్సిపల్‌ కార్పోరేషన్‌ అదనపు కమిషనర్‌ మయూర్‌ గోవేకర్‌, త్రిపుర ఐటి డైరక్టర్‌ దాస్‌, ఈ-గవర్నెన్స్‌ మిషన్‌ డైరక్టర్‌ డా.పార్థ ముఖర్జీలు ఉన్నారు.