టిఎస్‌ఐఐసి ఇక పేపర్‌ లెస్‌ ఆఫీస్‌

TSIIC, PAPER LESS
TSIIC, PAPER LESS

ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌
హైదరాబాద్‌: పరిపాలనను మరింతంగా వేగంగా అందించేందుకు టిఎస్‌ఐఐసిలో పేపర్‌ పాలనకు శ్రీకారం చుట్టారు. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ పాలనకు టిఎస్‌ఐఐసి శ్రీకారం చుట్టినట్లు, అందులో భాగంగానే టిఎస్‌ఐఐసిలో ఈ-ఆఫీస్‌ను ప్రాంరభిస్తున్నామని ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌రంజన్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో టిఎస్‌ఐఐసి ఈ-ఆఫీస్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ శాఖ అని పేర్కొన్నారు. టిఎస్‌ఐఐసి పేపర్‌లెస్‌ ఫైల్‌ మేనేజ్‌మెంట్‌ అని పేర్కొన్నారు. పనులు వేగంగా మరింత సమర్థవంగా నాణ్యతతో కూడిన పనులు జరిగేందుకు ఈ-ఆఫీస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డిజిటల్‌ సంతకాలతో సర్టిఫికెట్‌, డాటా ఒకరి నుంచి మరొకరికి పారదర్శంగా వేగంగా పాలన సాగే అవకాశం ఉంటుందన్నారు. ఈ-ఆఫీస్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎండి ఈ.వి.నర్సింహారెడ్డి, ఓఎస్‌డి వి.మిశ్రతో పాటు టిఎస్‌ఐఐసి ఎంఐఎస్‌ సభ్యులు సురజ్‌ కుమార్‌, విష్ణువర్థన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రుశిత, మౌనికలు పాల్గొన్నారు.