టిఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

 

TRS 1
TRS

హైదరాబాద్‌: తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రేపు మధ్యాహ్నాం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ఎల్పీ భేటీకానుంది. సమావేశం అనంతరం ముగ్గురు అభ్యర్థులను ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌ పేరు ఖరారు చేశారు. మరో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. యాదవ కోటాలో జైపాల్‌ యాదవ్‌ లేదా లింగయ్య యాదవ్‌కు అవకాశం దక్కేలా తెలుస్తోంది. ఇంకో సీటు కోసం ఎలిమినేటి ఉమామాధవరెడ్డి లేదా మహబూబ్‌ ఆలమ్‌ఖాన్‌లో ఎవరో ఒకరికి అవకాశం ఉండోచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాక, ఈ నెల 12న నామినేషన్లు దాఖలు చేయనున్నారు.