టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపట్లో…

TRS 1
TRS

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్దీ సేపటిలో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి కెసిఆర్‌, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ఈ నెల 5నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో టిఆర్‌ఎస్‌ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చ జరగనుంది. టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం సాయంత్రం 6గంటలకు సీఎం కెసిఆర్‌ మీడియా సమావేశం ఉంటుంది.