టిఆర్‌ఎస్‌, టిడిపి పొత్తు ఎందుకు?

AP,TS Cm's BABU, KCR (File)
AP,TS Cm’s BABU, KCR (File)

టిఆర్‌ఎస్‌, టిడిపి పొత్తు ఎందుకు?

కేంద్రంలో పట్టు సాధించుకునేందుకేనా?
బిజెపిపై పెరిగిన ఇద్దరు ‘చంద్రుల దూకుడు

హైదరాబాద్‌: తెలంగాణలో టిడిపి కేడ ర్‌ను కాపాడుకునేందుకు టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబు టిఆర్‌ఎస్‌తో పొత్తు సంకేతాలు ఇచ్చారు. అత్యధిక ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ లోకి వలస పోవ డంతో టిడిపి జీరో స్థాయికి వచ్చేసింది. టిడిఎల్పీ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవ డంతో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారు కూడా అటు ఇటు ఊగుతున్నారు. అందులో ఒక ఎమ్మెల్యేకు టిఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సీటుఆఫర్‌ ఉందన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబునాయుడు తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం నిర్వహించి పార్టీని కాపాడుకునేందుకు భరోసా ఇచ్చారు.

ఏ పార్టీ ప్రలోభాలు పెట్టి తమ నేతలను తీసుకెడుతుందని ఆరోపణలు చేశారో, ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు.రాజకీయాల్లో ఏదన్నా జరగవచ్చు. ఈ ఆలోచన వెనుక ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తో ఫైట్‌ చేసేందుకే అని చెబు తున్నారు. విభజన చట్టం హామీ మేరకు ఎపికి కేంద్రం నుంచి ప్రత్యేక హోదా లభించడం లేదని, కనీసం దానికి ప్రత్యామ్నా యంగా నిధులు కూడా లభించడం లేదని పార్లమెంట్‌లో ఎంపీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఏపిలో కూడా బందులు,ఆందోళనలు తీవ్రంగానే జరిగాయి.

దీనికి కోపగించుకున్న బిజెపి వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉండ దన్న సంకేతాలు కూడా ఇచ్చింది. దీంతో చంద్రబాబు కూడా బిజెపికి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగా ణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దూరంగా ఉండాలని అభిప్రాయంతో ఉన్నారు. టిఆర్‌ ఎస్‌ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో అంతర్గతంగా ఆయన ఏం మాట్లా డారోగానీ బిజెపి వ్యతిరేక పావులు కదులుతున్నాయి. రెండు రోజులుగా తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న కెసిఆర్‌ అనూహ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తీవ్రమైన పదజాలంతో దూషించారు.దీంతో తెలంగాణ బిజెపి నేతలు ఆగ్రహం చెందారు. వెంటనే గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి కెసిఆర్‌పై ఫిర్యాదు చేశారు.

ఈపరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో 2తెలుగు రాష్ట్రా ల్లో అధికార పార్టీలు ఒకే వైఖరితో ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నేతలు ఒకటే అనే సంకేతం ఇచ్చేందుకు కెసిఆర్‌తో చంద్రబాబు చేతులు కలుపుతున్నారన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి.ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్‌తో పాటు టిడిపిపై విమర్శలు సంధించిన టిఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు టిడిపి మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌ ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా టిడిపి,కాంగ్రెస్‌ పొత్తు ఉండాలని కోరుకున్నారు. కానీ అలా జరిగే పరిస్థితి లేదు.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరుకున్న విధంగానే టిఆర్‌ఎస్‌లో టిడిపి వీలనం కాకపోయినా పొత్తుకు సిద్దమనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చేశారు. టిడిపి స్వయంగా టిఆర్‌ఎస్‌తో పొత్తు కోరుకోవడం కూడా టిఆర్‌ఎస్‌ వర్గాల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. టిడిపి నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు, నేతలకు కెసిఆర్‌ ఇప్పటికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన వారిని ఆయన పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయం టిఆర్‌ఎస్‌ వర్గాల్లో ఉంది. కెసిఆర్‌ కూడా టిడిపి నుంచి బయటకు వచ్చినవారే కావడంతో టిడిపిపై పెద్దగా వ్యతిరేకత ఉండదని, పైగా పాత్ర మిత్రులకే మంత్రి పదవులు ఇచ్చారు కూడా. టిఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన టిడిపి నేతలు కూడా టిడిపితో స్నేహాన్ని కోరు కుంటున్నారు.