టిఆర్‌ఎస్‌లో చేరాల్సిన అవసరం మాకు లేదు

asaduddin owisi
asaduddin owisi

హైదరాబాద్‌: ఎంఐఎం ఎవరికీ ఎ టీమ్‌ బి టీమ్‌ కాదని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసి స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..మజ్లిస్‌ పార్టీని లేకుండా చేయాలన్న బిజెపి, కాంగ్రెస్‌ కలలు నెరవేరవని అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో చేతులు కలపాల్సిన అవసరం తమకు లేదని కేసిఆర్‌ను ప్రజలే మంచి మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2019లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో ఎంఐఎం మహిళా విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సర్వేలపై సిఈసి దృష్టి పెట్టాలని సూచించారు.