టిఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

TRS 1
TRS 1

గజ్వేల్‌: టిఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. జగదేవపూర్‌ ఎంపీపీ రేణుకతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే గజ్వేలో ప్రతాప్‌రెడ్డి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని ఉత్తమ్‌కుమార్‌ చెప్పారు.