టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది

Kadiyam Srihari
Kadiyam Srihari

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. సభలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై సీఎం కెసిఆర్‌
పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన మీడియా
సమావేశంలో డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. పార్టీని పటిష్ట చేయాలని నూతన కార్యదర్శులకు
సీఎం సూచించారు. అసెంబ్లీ తొలిరోజే కాంగ్రెస్‌ ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం బాధాకరం. ప్రతి సమసయపై చర్చించే అవకాశం
ఉన్నా ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వడం దురదృష్టకరం. కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల సమస్యలపై చర్చించాలన్న యోచన లేదు. కాంగ్రెస్‌కు
ఏజెండా లేదు. స్పష్టత లేదు. ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని నేడు బిఎసి సమావేశంలో సీఎం చెప్పారు. ఎన్నిరోజులైనా
చర్చిద్దామని సీఎం బాహాటంగా చెప్పినా విపక్షాలు వినలేదు. శీతాకాల సమావేశాలను 50 రోజులు కొనసాగిద్దామంటే విపక్షాలు వ్యంగ్యంగా మాట్లాడాయి. మీడియా దృష్టిని ఆకర్షించాలన్న ఆలోచనయే తప్ప ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదు. విజయవంతంగా  కొనసాగుతున్న పథకాలపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. రెండో పంటకు నీళ్లివ్వాలనే ఆలోచన ప్రజలకు తెలియాలి. ప్రతిపక్షాలు సజావుగా సాగడానికి సహకరించాలి. 50 రోజుల పాటు సభ జరిపే ఏజెండా అంశాలు తమ వద్ద ఉన్నాయని శ్రీహరి  అన్నారు.