టిఆర్ఎస్ అధికార దుర్వినియోగం

laxman copy
Laxman

హైదరాబాద్: ప్రగతి నివేదన సభ కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల అంశం తెరమీదకు ఎందుకు వచ్చిందో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలన్నారు. ఏక కాలంలో ఎన్నికలు జరిగే దానికి, ప్రధాని మోదీ ప్రతిపాదన చేసిన దానికి సుముఖత వ్యక్తం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని… అలాంటిది ఉన్నపలంగా ముందస్తుకు వెళతారనే ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఇవాళ ప్రగతి నివేదిక పేరుతో ఎన్నికల సభ జరుపుతున్నారని విమర్శించారు. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహిస్తున్నారని.. అంత అవసరమా అని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.