జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ ఛైర్మ‌న్‌తో కెటిఆర్ భేటీ

ktr meet with general electric motors chairman
ktr meet with general electric group  chairman

ఢిల్లీ: రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ బుధ‌వారం జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ ఛైర్మన్, సీఈవో జాన్ ఫ్లాన్నెరీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో మంత్రి హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెన్స్, ఎనర్జీ, ఏరోస్పేస్, మెడిటెక్ వంటి తదితర అంశాలపై చర్చించారు. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈ భేటీలో జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ సౌత్ ఏసియా ఛైర్మన్, సీఈవో విశాల్ వాంఛూ, రెసిడెంట్ కమిషనర్ అండ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.