జీఎస్టీపై స్పష్టత ఇంకా రాలేదు: మంత్రి ఈటల

Eetala Rajendar
Eetala Rajendar

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి 15వ సమావేశం ముగిసింది. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. జీఎస్టీ భేటీలో రాష్ట్రం తరపున పలు అంశాలు లెవనెత్తినట్లు చెప్పారు. ఆరు మాసాలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీఎస్టీపై స్పష్టత రాలేదన్నారు. లోగడ వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయంతో జీఎస్టీ ఆదాయం సరితూగలేదు. దేశంలోనే 21.9శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం ముందంజలో ఉంది. రాష్ట్రాల హక్కులు, స్వయం నిర్ణయాలపై ప్రభావం చూపకుండా జీఎస్టీ ఉండాలని మంత్రి ఈటల వివరించారు.