జినోమ్‌ వ్యాలీలో 235కోట్ల పెట్టుబడి

TS MINITER KTR
TS MINITER KTR

జినోమ్‌ వ్యాలీలో 235కోట్ల పెట్టుబడి

ఐరోపా ఫార్మా కంపెనీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌,: తెలంగాణ మరో ఫార్మ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. జినోమ్‌ వ్యాలీలో యూరోపియన్‌కు చెందిన ఫెర్సీ ఫార్మ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జినోమ్‌ వ్యాలీలో జరిగిన ఒక కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. స్విజ్జర్‌లాండ్‌ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న కంపెనీ 11- దేశాలలో తమ లావాదేవీలను నిర్వహిస్తుంది. కాగా కంపెనీ రూ.235కోట్ల మేర పెట్టుబడులు పెడుతుంది. ఫార్మా కం పెనీ తయారీతోపాటు ఆర్‌ అండ్‌ డికి సంబంధించిన లావాద వీలతో పాటు గ్యాస్టోలజీతో పాటు యూరోలజీకి చెందిన అంశాలను పరిశోధన చేయనున్నారు. మహిళలకు సంబంధిం చిన పరిశోధన చేస్తున్నారు. ఫెర్రింగ్‌ సిఈఓ సురేష్‌ పట్టత్తి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న అవకాశాలు చాలా బాగున్నాయని అందుకే పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.